Friday, 28 May 2021

సమంతను పక్కనబెట్టి ఆమెతో నాగ చైతన్య రొమాన్స్.. అలా బయటకొచ్చిన అసలు మ్యాటర్!

అక్కినేని నాగార్జున- కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ''. నాగార్జున రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు సీక్వల్‌గా ఈ మూవీ రూపొందనుంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించిన చర్చలు నడుస్తున్నప్పటికీ ఇంకా సెట్స్ మీదకు రాలేదు. అయితే చిత్రాన్ని జులైలో సెట్స్ పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించనుండగా.. నాగార్జున తనయుడు కూడా ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. అయితే చైతూ సరసన హీరోయిన్‌గా నటించనుందని, వారి మధ్య ఘాటైన రొమాంటిక్ సీన్స్ షూట్ చేయబోతున్నారని టాక్ నడించింది. కానీ తాజాగా బయటకొచ్చిన సమాచారం ప్రకారం చైతూతో రొమాన్స్ చేయబోయేది సమంత కాదని, తమిళ బ్యూటీ అని తెలుస్తుండటం ఆసక్తికర అంశంగా మారింది. ముందుగా చైతూ సరసన సమంతనే బెటర్ అని భావించిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చివరి క్షణంలో ప్రియాంక అరుల్ మోహన్ వైపు మొగ్గు చూపారని, ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా ఫినిష్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో నాగార్జున కొడుకుగా నాగ చైతన్య నటించనుండగా, చైతూ తనయుడిగా అఖిల్ కనిపిస్తారట. సో.. చూడాలి మరి 'బంగార్రాజు'లో హీరోయిన్లతో ఈ అక్కినేని వారసుల రొమాంటిక్ డోస్ ఏ రేంజ్‌లో ఉండనుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34mWhEt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...