Sunday, 16 May 2021

గేర్ మార్చిన మెగా డాటర్.. పొట్టి బట్టల్లో షాకిచ్చిన నిహారిక

మెగా డాటర్ పెళ్లి తరువాత గేర్ మార్చేశారు. అంతకు ముందు ఎన్నడూ కూడా పొట్టి బట్టలు ధరించేవారు కాదు. కానీ నిశ్చితార్థం అయ్యాక రూట్ మార్చేశారు. పెళ్లికి ముందు, బ్యాచ్‌లరెట్ పార్టీలు, గోవాలో సందడి చేసిన తీరు చూస్తే ఆమె ఎంతగా మారిపోయారో అర్థమవుతుంటుంది. ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ చేసుకున్న సమయంలోనూ నిహారిక పొట్టి బట్టల్లోనే మెరిశారు. ఇక పెళ్లి తరువాత నిహారిక చైతన్యలు ఇద్దరూ కూడా మాల్దీవుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. నిహారిక హనీమూన్ పిక్స్ సోషల్ మీడియాలో ఎంతటి రచ్చగా మారాయో అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి తరువాత నిహారిక అలవాట్లు కూడా మారిపోయాయి. మెట్టింట్లో నిహారిక రాణిలా ఉంటున్నట్టు తెలుస్తోంది. షూటింగ్‌ల నుంచి ఆలస్యంగా వచ్చి ఎక్కువ సేపు నిద్రపోయినా అత్తింటి వారు ఏమీ అనరని, ఎంతో సపోర్ట్ చేస్తుంటారని నిహారిక ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక షూటింగ్‌లో నిహారికకు గాయమై బెడ్‌కే పరిమితమయ్యారు. ఆ సమయంలో నిహారిక భర్త చైతన్య ఎన్నో సపరియలు చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ మధ్యే నిహారిక వంటింట్లో కొత్త రెసిపీలను ట్రై చేశారు. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం షూటింగ్‌లు మూలన పడటంతో నిహారిక ఇంటి పట్టునే ఉంటున్నట్టు కనిపిస్తోంది. పెళ్లి తరువాత నిహారిక ఇక సినీ రంగానికి దూరంగా ఉంటుందని అంతా భావించారు. కానీ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభించి అందరినీ ఆశ్చర్య పరిచారు. తాజాగా నిహారిక ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో నిహారిక పొట్టి బట్టల్లో కనిపించి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మొత్తానికి పెళ్లి తరువాత అందాల ఆరబోతలో నిహారిక గేర్ మార్చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SU3TMa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...