Sunday, 16 May 2021

ప్రతీ సారి అదే ఫీలింగ్!.. హీరోపై ప్రేమను బయటపెట్టేసిన ‘రొమాంటిక్’ బ్యూటీ

ఇస్మార్ట్ హీరో ఎనర్జి ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎనర్జిటిక్ స్టార్ అనే ట్యాగ్‌కు తగ్గట్టుగానే రామ్ తన సత్తాను చాటుతుంటారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ రామ్ ఫాంలోకి వచ్చారు. అంతకు ముందు వరుసగా ఫెయిల్యూర్లతో బాధపడుతున్న రామ్, పూరి జగన్నాథ్‌లకు ఇస్మార్ట్ శంకర్ మళ్లీ ఊపిరిపోసింది. అలా పూరి గ్యాంగ్‌లోకి రామ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ RED అనే సినిమాను చేసినా కూడా అంతగా వర్కవుట్ కాలేదు. అలా ఇంకా అందరూ ఇస్మార్ట్ ఫీవర్లోనే ఉన్నారు. రామ్, పూరి జగన్నాథ్, ఛార్మీలు కలిసి సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. గత ఏడాది రామ్ బర్త్ డే సందర్భంగా చేసిన పోస్ట్ బాగానే వైరల్ అయింది. అప్పుడు కూడా దేశం మొత్తం లాక్డౌన్‌లోనే ఉంది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. పరిస్థితులు చక్కబడ్డాక అందరం కలుద్దాం, గట్టిగా పార్టీ చేసుకుందామని గతేడాది రామ్ బర్త్ డే సందర్బంగా ఛార్మీ చేసిన పోస్ట్ వైరల్ అయింది. మొన్న (మే 15) రామ్ బర్త్ డే సందర్భంగా ఛార్మీ షేర్ చేసిన ఇస్మార్ట్ వీడియో బాగానే వైరల్ అయింది. దానిపై రొమాంటిక్ హీరోయిన్ చేసిన కామెంట్ మరింతగా ఆకట్టుకుంటోంది. ఆకాశ్ పూరి హీరోగా రాబోతోన్న రొమాంటిక్ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఇక ఈ మూవీకి మోక్షం ఎప్పుడు కలుగుతుందో గానీ.. కేతికా శర్మకు మాత్రం సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. రామ్ గురించి కేతికా శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పిచ్చి, వెర్రి.. ప్రతీసారి మైండ్ బ్లాంక్ అవుతూనే ఉంటుంది అని రామ్‌పై తన ప్రేమను బయటపెట్టేశారు కేతిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hvoukf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...