Friday, 7 May 2021

పెళ్లి.. ఈ ఒక్కటి కమిట్‌ అయ్యామంటే! లైఫ్‌లో ఎంత సక్సెస్ అయినా చివరకు.. పూరి సంచలన వ్యాఖ్యలు

గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఓ పని పెట్టుకొని మరీ జనానికి కొన్ని విషయాలు చెప్పిన సంగతి తెలిసిందే. ‘’ పేరుతో వరుస ఆడియోలు రిలీజ్ చేస్తూ సమాజంలో జరిగే చాలా విషయాలపై ఆయన ఓపెన్ అయ్యారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులపాటు వాటికి ఫుల్‌స్టాప్ పెట్టి సినిమా షూటింగ్స్‌తో బిజీ అయిన ఆయన.. కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక మళ్ళీ లైన్ లోకి వచ్చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ‘’ అనే అంశాన్ని తీసుకొని ఆయన వివరణ ఇచ్చారు. గొప్పలకు పోయి జీవితంలో ఎంత విజయం సాధించినా చివరికి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది 'మినిమలిజం' అంటూ ఈ ఆడియో ద్వారా పూరి జగన్నాథ్ సూచించారు. ''మినిమలిజం అంటే అనవసరమైన దాన్ని అవాయిడ్ చేయడం. ఇదే సింప్లిసిటీ. మినిమలిస్టులను చూడండి.. కావాల్సిన దాన్ని మాత్రమే వాళ్లు తమ దగ్గర ఉంచుకుంటారు. వాళ్లింట్లో కూడా కావాల్సిన వస్తువులు మాత్రమే ఉంటాయి. బీరువాలో కేవలం ఏడు జతల దుస్తులు మాత్రమే ఉంటాయి. కానీ మన ఇళ్లలో బీరువా తెరవగానే గుట్టలు గుట్టలుగా దుస్తులు వచ్చి మన కాళ్లపై పడిపోతాయి. సింపుల్‌గా బతకడం మనకి రాదు. మినిమలిస్ట్‌ దగ్గర ఒక ఫోన్‌ ఉంటే అది పనిచేసినంత కాలం దాన్నే వాడతాడు. అంతేకానీ మార్కెట్‌లోకి వచ్చిన ప్రతీ వస్తువు కొనుక్కుంటూపోడు. వీలైనంత తక్కువ స్పేస్ ఉన్న ఇంట్లో ఉంటాడు. కానీ, తుడవలేనంత పెద్ద ఇంట్లో ఉండాలని మనందరికీ ఉంటుంది. నలుగురు పనోళ్లు, నలుగురు డ్రైవర్లు, ఒక తోటమాలి, ఒక వాచ్‌మెన్‌, ఒక కుక్‌, అంట్లు తోమడానికి ఓ మనిషి. అందుకే మినిమలిస్టును చూసి మనం నేర్చుకోవాలి. లెస్‌ ఈజ్‌ మోర్‌ అని ఫీల్ అవుతారు వాళ్ళు. దొరికింది కదా అని ఊరంతా అప్పులు చేయరు. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ సంతోషంగా ఉంటారు. జీవన ప్రయాణాన్ని వీలైనంత వరకూ సింప్లిఫై చేసుకుంటూ పోతారు. వాళ్ల దగ్గర అనవసరమైన వాటి గురించి ఒక లిస్ట్‌ ఉంటుంది. అందులో పెళ్లి కూడా ఉంటుంది. పెళ్లి.. ఈ ఒక్కటి కమిట్‌ అయితే మినిమలిజం లేదు. గాడిదగుడ్డూ లేదు. నదిలోకి దూకేసినట్టే. కొట్టుకుపోతూ ఉంటాం. ఎక్కడ ఆగుతామో ఎవ్వరికీ తెలీదు. అలా నది లోకి దూకరు కాబట్టే మినిమలిస్టులు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్లు బంధాలకు ఎక్కువ విలువ ఇవ్వరు. కానీ అనుబంధాలకు ప్రాధాన్యం ఇస్తారు. లైఫ్‌లో చిన్న చిన్న మూమెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్లు ఎవ్వరికీ భారంగా మారరు. అలాగే వేరేవాళ్ల బరువుని వాళ్లు ఎత్తుకోరు. మినిమలిస్టులు జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడతారని అందరికీ ఓ అపోహ ఉంటుంది. అది నిజం కాదు. వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు. అలాగే ఇతరులను ఇబ్బంది పెట్టరు. వాళ్లు త్యాగాలు చేయరు. అందుకే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. పాతకాలంలో చూసుకుంటే రాజులు ఎన్నో యుద్ధాలు చేసి తమ రాజ్యాన్ని విస్తరించుకున్నాక వాళ్లకి కలిగే జ్ఞానమే మినిమలిజం. బుద్ధ ఒక మినిమలిస్ట్‌. ఒంటి మీద వస్త్రం. చేతిలో ఒక బౌల్. చెట్టు కింద నీడ. లైఫ్‌లో ఎంత సక్సెస్ అయినా అందరూ అలవాటు చేసుకోవాల్సింది మినిమలిజం. అది ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటే మంచిది'' అని పూరి జగన్నాథ్ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uv5ztj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...