Monday, 17 May 2021

నితిన్ డైరెక్టర్‌తో నాగచైతన్య నెక్ట్స్ సినిమా.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారుగా..!

అక్కినేని ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగేశ్వర రావు నుంచి లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ వరకూ ప్రతీ ఒక్కరు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే వీరిలో కొందరు సక్సెస్ సాధించగా.. మరి కొందరు ఇంకా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అక్కినేని నటవారసుడిగా తెలుగు తెరపై అడుగుపెట్టిన నాగచైతన్య.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. కెరీర్ ఆరంభంలో మంచి హిట్లు అందుకున్న అతను.. ఆ తర్వాత ఫ్లాప్‌లను చవి చూశాడు. ‘వెంకీమామ’, ‘మజలీ’ తదితర సినిమాలతో సక్సెస్ అందుకొని మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు . ప్రస్తుతం అతను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టారీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత ‘మనం’ సినిమా ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ‘లవ్‌స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మరోవైపు ‘థాంక్యూ’ సినిమా ఇటలీలో షూటింగ్ షెడ్యూల్‌ని ఈ మధ్యే పూర్తి చేసుకుంది. అయితే తాజాగా నాగా చైతన్య మరో ప్రాజెక్టును ఓకే చేశాడని తెలుస్తోంది. నాగశౌర్యతో ‘ఛలో’, నితిన్‌తో ‘భీష్మ’ సినిమాలు రూపొందించిన వెంకీ కుడుములతో నాగచైతన్య సినిమా చేస్తున్నాడని ఫిలిమ్ నగర్‌లో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాగచైతన్యకి కథ వినిపించగా.. అతను సినిమాకు ఓకే చెప్పినట్లు టాక్. నాగ చైతన్యతో తనదైన మార్క్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే సినిమాని వెంకీ కుడుముల రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కనక ఓకే అయితే.. చై కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని సన్నిహితులు చెబుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tVZViG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...