Saturday, 15 May 2021

అక్కినేని ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. అందుకోసం సమంత రెడీ.. ముహూర్తం ఫిక్స్!

క్రమంగా ఓటీటీ లకు డిమాండ్ పెరుగుతోంది. స్టార్ హీరోహీరోయిన్లు ఓటీటీ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ లీడ్ రోల్ పోషించిన '' విడుదలకు రెడీ అయింది. గతంలో ప్రసారమై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన 'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా వస్తోన్న 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో ఆమె కీలక పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది. మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. ఈ మూవీని తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా వస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్‌ను జూన్‌ నెల నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు టాక్. త్వరలోనే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. మే నెల చివరి వారంలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్‌ విడుదల కానుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. ఈ మూవీలో సమంత టెర్రరిస్టు పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tY67Hj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...