భరద్వాజ్ బుల్లితెరపై యాంకర్‌గా వెండితెరపై నటిగా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటి అనసూయ రంగస్థలం సినిమాతో స్టార్డంను సొంతం చేసుకున్నారు. అప్పటి వరకు గ్లామర్ పరంగానే అనసూయను చూసిన వారంతా రంగమ్మత్తగా జీవించడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలోనూ అందరూ రంగమ్మత్త అనే పిలిచివారని అనసూయ ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు. అలాంటి అనసూయ తాజాగా ఉప్పెన డైరెక్టర్ సానా గురించి ఓ విషయం చెప్పుకొచ్చారు. రంగస్థలం సెట్‌లో అందరూ అత్త అని పిలిచే వారు.. సుకుమార్ కూడా అలానే పిలిచేవారు.. రామ్ చరణ్ మాత్రమే అనసూయ అని అనేవారు. బుచ్చిబాబు కూడా అత్త అని అనేవాడు. రంగస్థలం సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది అని అనసూయ అసలు విషయం చెప్పుకొచ్చారు. నా పర్సనల్ విషయాలు కూడా పంచుకునేది ఆ డైరెక్టర్‌తోనే అంటూ బుచ్చిబాబు గురించి అనసూయ తెలిపారు. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటాను.. చాలా సన్నిహితులమయ్యాం. అలాంటి వ్యక్తి మా ఇంటికి దగ్గర్లోనే ఉప్పెన మూవీ షూటింగ్ చేసేందుకు వచ్చాడు. ఫోన్ చేసి.. అత్త నేను ఇక్కడే షూటింగ్ చేస్తున్నాను.. విజయ్ సేతుపతి కూడా ఉన్నారు.. రా అని అన్నాడు. అలా రమ్మనడంతోనే విజయ్ సేతుపతి కోసం వెళ్లిపోయాను అంటూ అనసూయ అన్నారు. పిజ్జా సినిమా నుంచే విజయ్ సేతుపతి ఇష్టం కానీ 96 చూశాకా.. రామ్ పాత్రలో విజయ్ సేతుపతి ఇంకా నచ్చేశాడు అని అనసూయ అన్నారు. అలా జరిగిన పరిచయంతోనే చెన్నైకి వెళ్లినప్పుడు కూడా కలిశాను అని అన్నారు. ఏదో ఒక రోజు ఆయనతో కలిసి పని చేసే రోజు రావాలని అనుకుంటున్నాను అని అనసూయ తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b9CcoO
v
No comments:
Post a Comment