Tuesday, 25 May 2021

చంద్రమోహన్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ యాక్టర్

తెలుగు తెరపై సీనియర్ యాక్టర్ సినీ ప్రయాణం చాలా పెద్దది. ఎన్నో విలక్షణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు చంద్రమోహన్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారాయన. అప్పటి ఆర్టిస్టులలో ఇంకా యాక్టివ్‌గా ఉన్నవారిలో చంద్రమోహన్ ఒకరు. ప్రస్తుతం ఆయన వయసు 81 సంవత్సరాలు. అయితే ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం గురించి పెద్దఎత్తున రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. చంద్రమోహన్ ఫొటోస్ షేర్ చేస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అనారోగ్యంతో బాధపడుతున్నారని పోస్టులు చేస్తున్నారు. కొంతమంది ఔత్సాహికులు అయితే చంద్రమోహన్ మరణించారని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. దీంతో ఈ పోస్టులు వైరల్ అయ్యాయి. ఇది చూసిన చంద్రమోహన్‌ వెంటనే స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చంద్రమోహన్ మాట్లాడుతూ.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తన ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయని, అవేవీ నమ్మొద్దని తెలిపారు. అభిమానుల ఆశీస్సులే తనకు శ్రీరామ రక్ష అన్నారు. రీసెంట్‌గా (మే 23) చంద్రమోహన్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా అని ఆయన అన్నారు. ఇకపై తన సినీ ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు చంద్రమోహన్. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు, తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తాను సినిమాల్లో చేయకపోయినా రోజూ తాను నటించిన ఏదో ఒక సినిమా టివిల్లో రోజూ వస్తూనే ఉంటాయని ఆయన అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uiqcIp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...