Wednesday, 5 May 2021

ఒక్క ఫోటో షూట్.. నేషనల్ వైడ్ ట్రెండ్.. ఐశ్వర్యా రాజేష్ రచ్చ

తెలుగు మూలాలు ఉన్న హీరోయిన్ తమిళ నాట సత్తా చాటారు. హీరో రాజేష్ కూతురైన ఐశ్వర్యా రాజేష్ కోలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ చాలెంజిగ్ రోల్స్‌ను ఎంచుకుంటూ ఈ స్థాయి వరకు వచ్చారు. తమిళంలో ఐశ్వర్యా రాజేష్ చేసిన సినిమాలు, పోషించిన పాత్రలన్నీ కూడా బాగానే క్లిక్ అయ్యాయి. అలా తమిళంలో వచ్చిన క్రేజ్‌తో టాలీవుడ్‌లోనూ ఐశ్వర్యా రాజేష్ అడుగుపెట్టేశారు. అలా వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్యా కృష్ణమూర్తి వంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఐశ్వర్యా రాజేష్ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో భాగస్వామి అయ్యారు. పాత్రకు ప్రాధాన్యముండే చిత్రాల్లో నటించే ఐశ్వర్యా రాజేష్ తాజాగా సోషల్ మీడియాను షేక్ చేసేశారు. అదిరిపోయే ఫోటో షూట్లతో అందరినీ ఆకట్టుకున్నారు. అందాల ఆరబోతకు దూరంగా ఉండే ఐశ్వర్యా రాజేష్ తాజాగా మోడ్రన్ అవుట్ ఫిట్‌లో కనిపించారు. తెల్ల రంగు దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చారు. ఎక్స్ పోజ్ చేయకుండా ఐశ్వర్యా రాజేష్ చేసిన ఈ ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో ఐశ్వర్యా రాజేష్ పేరు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. రిపబ్లిక్, టక్ జగదీశ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు ఐశ్వర్యా రాజేష్ రెడీ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3enPCQe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...