Monday, 3 May 2021

నందమూరి హీరో సినిమాకి డిఫరెంట్ టైటిల్.. ఇంత వెరైటీ టైటిల్‌లో రావడం ఇదే తొలిసారి..

తెలుగు సినీ పరిశ్రమపై నందమూరి కుటుంబం ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దాయన ఎన్టీఆర్ తర్వాత కుమారులు బాలకృష్ణ, హరికృష్ణలు హీరోలుగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. మూడో తరంలో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయిన వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ కొంత సమయంలోనే స్టార్ హీరోగా చలామణి అవుతున్నాడు. ఆ తర్వాత కెరీర్‌లో పెద్ద హిట్లు అందకపోయినా.. నటన పరంగా ప్రేక్షకుల ఆదరణ పొందాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాలకు ప్రొడ్యూసర్‌గా ఉంటున్నాడు. 2019లో ‘118’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కళ్యాణ్ రామ్.. మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘ఎంత మంచివాడవురా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో తన తదుపరి సినిమాల ఎంపిక విషయంలో అతను తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రేక్షకుల్లోకి వెళ్లే స్క్రిప్ట్‌లనే అతను ఆచితూచి ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్-రాజేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని ఫిక్స్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి ఫన్ అండ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘ఎమిగోస్’ అనే టైటిల్‌ని ఎంపిక్ చేశారట. ఎమిగోస్ అంటే మెక్సికన్ భాషలో ‘హలో’ అని అర్థం. ఇదే నిజమైతే మెక్సికన్ భాషలో సినిమా టైటిల్‌తో తెలుగులో సినిమా విడుదల చేసే తొలి హీరోగా కళ్యాణ్ రామ్ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ అందుకుంటాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ro24pK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...