Sunday, 9 May 2021

అనసూయపై కన్నేసిన హైపర్ ఆది.. డైరెక్టుగా ఆ మ్యాటర్ లోకి! ఎమోషనల్‌గా ఓపెన్ అయిన జబర్దస్త్ యాంకర్

జబర్దస్త్ జోడీల్లో యాంకర్ అనసూయ- జోడీకి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కనిపిస్తే చాలు రొమాంటిక్ పంచులేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు కమెడియన్ హైపర్ ఆది. జబర్దస్త్ వేదికపై వీళ్లిద్దరి రొమాంటిక్ ముచ్చట్లు చాలానే ఉన్నాయి. ఎన్నో ప్రోగ్రామ్స్‌లో అనసూయతో కలిసి రొమాంటిక్ డాన్సులేస్తూ బుల్లితెరను షేక్ చేసిన హైపర్ ఆది ఇప్పుడు అదే అనసూయపై కన్నేసి ఏకంగా పెళ్లి గురించి కామెంట్ చేశాడు. దీంతో ఈ ఇష్యూ వైరల్ అవుతోంది. హైపర్ ఆది వేసే పంచుల్లో ఏ రేంజ్ కిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భాన్ని బట్టి దూసుకుపోతుంటాడు ఆది. డబుల్ మీనింగ్ డైలాగులకు రొమాంటిక్ సెన్స్ యాడ్ చేయడంతో ఆయన్ను మించిన కమెడియన్ లేడనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో వీడియోలో యాంకర్ అనసూయను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అనసూయను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేదో అంటూ కోరిక బయటపెట్టాడు హైపర్ ఆది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హంగామా చేస్తోంది. మే 13వ తేదీన ప్రసారం కాబోయే జబర్దస్త్ ప్రోగ్రామ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హైపర్ ఆది, శాంతి స్వరూప్ స్కిట్ హైలైట్ అయింది. తరచూ తన స్కిట్లలో అనసూయను వాడేసే హైపర్ ఆది.. ఈ స్కిట్ లోనూ అదేపని చేశాడు. అనసూయకు తన పెళ్ళాం చెల్లెలు పాత్ర ఇచ్చేసి పంచుల వర్షం కురిపించాడు. హైపర్ ఆది భార్యగా శాంతి స్వరూప్, మరదలిగా అనసూయ వేదికపైకి వచ్చారు. అనసూయను అలాగే చూస్తూ ‘ఏంటి మీ చెల్లి తల ఎత్తదా' అని అడగగా.. అనసూయ ‘మా నాన్నగారు ఎత్తొద్దన్నారు' అని బదులిస్తుంది. అప్పుడు ఆది తనలోని పంచ్ మహారాజ్‌ని బయటకుతీశాడు. ‘మా చెల్లి చపాతీలా ఉంటుంది' అని శాంతి స్వరూప్ చెప్పగా.. 'ఆవిడ చపాతీలా ఉంటే.. నువ్వు చపాతీ కర్రతో కొట్టినట్లు ఉంటావు' అంటూ పంచ్ వేసేశాడు ఆది. దీంతో వెంటనే అనసూయ రియాక్ట్ అవుతూ 'మా అక్క పరువు తీయొద్దు. తను నాకు ఎన్నో ఇచ్చింది.. తను చదువు మానేసి నాకు పలకిచ్చి పంపింది' అంటూ కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పింది. దీంతో హైపర్ ఆది వెంటనే 'అది పెళ్లి చేసుకోవడం మానేసి నీకిచ్చి చేసినా బాగుండేది' అనేశాడు. ఈ సీన్ చూసి జడ్జ్‌లు ఇంద్రజ, మనో ఒక్కసారిగా షాకయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vPKJoM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...