Thursday, 20 May 2021

యమ స్మార్ట్‌ ఎన్టీఆర్.. అర్ధరాత్రి వేళ అలా!! కొరటాల స్కెచ్ మామూలుగా లేదే..

వరుసపెట్టి బాక్సాఫీస్ హిట్స్ పట్టేస్తూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం భారీ బడ్జెట్ మూవీ RRR చేస్తున్న ఆయన.. ఇటీవలే కొరటాల శివతో మరో సినిమా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. 30వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కథలో కొత్తదనం చూపిస్తూ ఆ కథను సామాజిక కోణంలో సానబట్టే కొరటాల.. ఈ మూవీ కోసం స్పెషల్‌గా రెడీ చేసిన స్టోరీకి మెరుగులు దిద్దుతున్నారట. అయితే ఈ రోజు (మే 20) ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా గత అర్ధరాత్రి వేళ సర్‌ప్రైజ్ ఇచ్చారు కొరటాల. తారక్‌ పుట్టినరోజు కానుకగా NTR30 నుంచి సరికొత్త ఫొటోని షేర్‌ చేశారు. ఇందులో ఇన్‌షర్ట్‌ చేసుకుని క్లాసీ, ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్న యంగ్ టైగర్.. స్మార్ట్‌ లుక్‌తో అదరగొట్టేస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. రీసెంట్‌గా ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయమై ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఇందులో అమాయక చక్రవర్తిగా ఎన్టీఆర్ నటిస్తున్నారని అన్నారు. తాజా లుక్ చూస్తుంటే అదే నిజమన్నట్లుగా అర్థమవుతోంది. ఈ మూవీ కోసం కొరటాల ఇంకాస్త డిఫరెంట్ స్కెచ్ వేశారని టాక్. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, నందమూరి కళ్యాణ్ రామ్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు. గతంలో ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మూవీ నందమూరి అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చింది. దీంతో మరోసారి ఈ కాంబో మూవీ రానుండటం జనాల్లో ఆసక్తి పెంచేసింది. చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీని ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oxnywW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...