Monday, 10 May 2021

'బంగార్రాజు' క్రేజీ అప్‌డేట్.. వారసులతో నాగార్జున సందడి! అఖిల్ అలా కనిపిస్తాడా..?

అక్కినేని హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న '' సినిమాపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో 'బంగార్రాజు' పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగ్. దీంతో ఈ పాత్ర పేరునే టైటిల్‌గా తీసుకొని కళ్యాణ్ కృష్ణ మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు రావాల్సి ఉండగా.. ఎప్పటికప్పుడు పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికైతే చాలా రోజుల పాటు ఈ మూవీ స్క్రిప్ట్ పనులపై కసరత్తులు చేసిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ.. ఈ సినిమాను జులైలో సెట్స్ పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున జోడీగా రమ్యకృష్ణ నటించనుండగా.. నాగార్జున తనయుడు నాగ చైతన్య ఓ ముఖ్యపాత్ర పోషించబోతున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ ప్రాజెక్టులో అక్కినేని అఖిల్ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది. వెండితెరపై నాగార్జున మనవడిగా అఖిల్ కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. నాగార్జున కొడుకుగా నాగ చైతన్య నటించనుండగా.. ఆయన తనయుడిగా అఖిల్ కనిపిస్తారట. చైతూ రోల్ కొంతసేపే ఉంటుందట కానీ అఖిల్‌కి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఇవ్వబోతున్నారట. తాత- మనవడిగా నాగార్జున- అఖిల్ పర్‌ఫార్‌మెన్స్ పీక్స్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల. కథ అంతా కూడా నాగ్- అఖిల్ మధ్యే నడిచేలా బలమైన స్క్రిప్ట్ రెడీ చేశారని తెలిసింది. నాగార్జున కూడా అఖిల్ సక్సెస్ కోసం బాగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన సినిమాతోనే అఖిల్‌ని ట్రాక్ ఎక్కించేలా ఆయన ఈ స్కెచ్ వేశారని అంటున్నారు. ఏదేమైనా రియల్ లైఫ్ తండ్రీ కొడుకులు.. రీల్ తాత- మనవలుగా సందడి చేయడమనేది క్రేజీ విషయమే. సో.. చూడాలి మరి ఏం జరుగుతుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vXyTc6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...