Thursday, 13 May 2021

కరోనాతో ఇండస్ట్రీలో మరో విషాదం.. వైరస్ సోకి మరో ప్రముఖుడు కన్నుమూత

రెండో దశలో కరోనా మహమ్మారి భయానకంగా వ్యాపిస్తోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నారు. ఈసారి కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీపై తీవ్రంగానే ఉంది. ఇప్పటికే వైరస్ సోకి పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రముఖ గ్రామ్‌ఫోన్ రికార్డుల సంస్థ ‘’తో సుదీర్ఘమైన అనుభవం ఉన్న మంగళంపతి(92) సోకి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల క్రితం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన మంగళవారం రాత్రి మృతి చెందారు. మొదటి నుంచి సంగీతం, సాహిత్యం అంటే మంగళంపతికి మక్కువ ఉండేది. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణించాలని ఆయన తాపత్రేయపడేవారు. తిరుపతిలో జన్మించిన ఆయన హెచ్.ఎమ్.వి. సంస్థ దక్షిణాది విభాగానికి ఆయన అధిపతిగా.. ప్రధాన సలహాదారుడిగా సేవలను అందించారు. ఈ రంగంలోకి రాక ముందు ఆయన టీటీడీలోను .. రైల్వే శాఖలోను పనిచేశారు. ఇక హెచ్‌.ఎం.వీ సంస్థలో చేరిన తర్వాత ఆయన ఎంతో మంది గాయకులను, సంగీత దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటసాలతో ‘భగవద్గీత’, ఎంఎస్ సుబ్బులక్ష్మీతో ‘అన్నమయ్య కీర్తనలు’ పడించిన ఘనత మంగళంపతికే దక్కింది. ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా.. ‘‘ఎన్ని సినిమాలు నిర్మించినా.. ఎన్ని పాటలు రికార్డు చేసినా.. ఘంటసాలతో పాడించిన భగవద్గీతకు ఏవీ సరితూగవు’’ అంటూ ఆయన చెప్పేవారు. మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w62qQX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...