Monday, 12 April 2021

Vakeel Saab: ప్రకాష్ రాజ్ క్యారెక్టర్‌పై చిరంజీవి కామెంట్స్ వైరల్.. ఏకంగా అలా అనడంతో!!

మూడు సంవత్సరాల విరామం తర్వాత పవర్‌స్టార్ నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్’. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో నటించగా.. ప్రత్యర్థి లాయర్ పాత్రలో విలక్షణ నటుడు నటించారు. సినిమాలో కోర్టు సీన్లలో పవన్, ప్రకాశ్ రాజ్ మధ్య జరిగే సన్నివేశాలు, సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. సినిమా చూసిన ప్రేక్షకులు పవన్‌తో పాటు ప్రకాశ్ రాజ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజా మెగాస్టార్ .. ప్రకాశ్ రాజ్‌ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్న చిరు.. ‘‘ప్రకాశ్ రాజ్ వంటి సత్తా ఉన్న నటుడి ఉంటే ఇతర నటుల ప్రతిభ కూడా బయటకు వస్తుంది. వకీల్‌సాబ్ చిత్రంలో అతని నటన అద్భుతం.. పవన్ కళ్యాణ్‌కు ధీటుగా ఆయన తన పాత్రను రక్తి కట్టించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాను. ప్రత్యేక అభినందనలు ప్రకాశ్’’ అని అన్నారు. ‘పింక్’ సినిమా రీమేక్‌గా తెరకెక్కిన ‘వకీల్‌సాబ్’ చిత్రం తొలి రోజే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. రీమేక్ అయినప్పటికీ.. పవన్‌కళ్యాణ్ మాస్ ఇమేజ్, బాడీ లాంగ్వేజీకి తగినట్లు స్క్రీప్ట్‌లో కొన్ని మార్పులు చేసి.. పవన్‌ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో.. అలాగే చూపించాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇక ఈ సినిమాలో నివేదా, అంజలి, అనన్యలు తమ నటనతో అందరిని ఆకట్టుకన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a4Etkw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...