Monday, 12 April 2021

‘మీరుపైకి రాకండి.. వాళ్లని నేను చూసుకుంటా..’ దేశభక్తి ప్రతిబింబిచేలా ‘మేజర్’ టీజర్.. శేష్ మళ్లీ అదరగొట్టేశాడు.

2008 నవంబర్‌లో ముంబైలో జరిగిన భయానక ఉగ్రవాద దాడిలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ఎంత మంది ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. సైయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాల హీరోయిన్లుగా చేస్తున్నారు. ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. తెలుగులో ఈ టీజర్‌ని సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేయగా.. హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. ‘అసలు సోల్జర్ ఎందుకు అవ్వాలని అనుకుంటున్నావ్.. దేశభక్తా?’.., ‘దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లని కాపాడటం సైనికుడి పని’.. ఇలాంటి డైలాగ్స్‌ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. మేజర్ సందీప్ పాత్రలో అడివి శేష్ ఒదిపోయాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. అద్భుతమైన విజువల్స్, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడిన ఈ టీజర్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చివరిగా ‘మీరు పైకి రాకండి.. వాళ్లని నేను హ్యాండిల్ చేస్తాను’ అంటూ అడివి శేష్ చెప్పిన డైలాగ్ కొసమెరపు. ఇకపోతే ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది జూలై 2న విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e1Kj7I
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...