Tuesday, 20 April 2021

NTR 30: ఎన్టీఆర్ ఇలా కొరటాల అలా!! ఎవరికివారు డిసైడ్ కావడంతో డైలమాలో ఫ్యాన్స్

జనతా గ్యారెంజ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్- కాంబో మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. 30వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. 'ఎన్టీఆర్‌-కొరటాల2'గా ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేయడంతో నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తిపోయారు. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో డైలామా నెలకొందనేది లేటెస్ట్ న్యూస్. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు. ఏప్రిల్ 29వ తేదీ 2022న రిలీజ్ చేస్తామని కూడా ముందే ప్రకటించేశారు. ఈ క్రమంలో చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగవంతం చేసిన కొరటాల.. హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్ సెలక్షన్ ప్రాసెస్ మొదలుపెట్టారట. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ విషయమై ఎన్టీఆర్, కొరటాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది ఇన్‌సైడ్ టాక్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా సంగీత దర్శకత్వ బాధ్యతలను సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు అప్పగించాలని కొరటాల భావిస్తుండగా.. ఎన్టీఆర్ మాత్రం దేవీ శ్రీ ప్రసాద్ అయితే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయమై ఎన్టీఆర్, కొరటాల మధ్య చర్చలు నడుస్తున్నారని, త్వరలోనే ఫైనల్ డిసీజన్ తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీని ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భారీ సినిమా RRRతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అతిత్వరలో కొరటాలతో సినిమా స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. ఓ వైపు బయట పరిస్థితులు చూస్తుంటే కరోనా విలయతాండవం చేస్తోంది. చూడాలి మరి ఈ సిచుయేషన్‌లో సినిమా షూటింగ్స్ ఎలా ముందుకు సాగుతాయనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dAbFTn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...