Tuesday, 20 April 2021

‘ఆదిపురుష్’ నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్యాన్స్ బీ రెడీ.. సర్‌ప్రైజ్ ఇవ్వనున్న సినిమా యూనిట్

‘బాహుబలి’ చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అంతర్జాతీయస్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తర్వాత అతను బాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రాధకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న వింటేజ్ ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’ ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమా జరుగుతుండగా.. ప్రభాస్ మరో రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేశాడు. అందులో ఒకటి ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘’ సినిమా. రామాయణ మహాకావ్యం ఆధారంగా పాన్ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా రాముడిగా ప్రభాస్.. సీతగా , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక లంకేశ్వర రావణాసుడి పాత్రని సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. 30వేల సంవత్సరాల పూర్వం జరిగిన కథతో రామాయణానికి ఉన్న సంబంధాన్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారట. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు 30 శాతం పూర్తయిందని చిత్రబృందం ప్రకటించింది. గత సంవత్సరమే సినిమా ప్రధాన పాత్రధారుల ప్రిన్సిపల్ ఫోటోగ్రాఫి పూర్తయినట్లు స్పష్టం చేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్‌లు బాడీ ట్రాన్స్‌ఫార్మ్‌ కోసం ఎంతో శ్రమిస్తున్నారని, కృతి సనన్‌తో కలిసి పని చేయడం ఎంతో మంచి అనుభూతి అని తెలిపారు. ఇక శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 21) ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్‌లో నూతన ఉత్సాహం నెలకొంది. మొత్తానికి మూడు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషి చేస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3x9WNCY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...