Monday, 12 April 2021

Maha Samudram: 'మహా' లుక్ రివీల్.. లోతుగా ఆలోచిస్తున్న యంగ్ హీరోయిన్! మ్యాటర్ ఏంటో మరి..

తొలి సినిమా Rx100 తోనే దర్శకత్వ ప్రతిభ చాటుకున్న అజయ్‌ భూపతి లేటెస్ట్ మూవీ ''. సినిమాను డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయడమే గాక సినిమాలో హీరోయిన్ రోల్ మరింత డిఫరెంట్‌గా తీర్చిదిద్దడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్ భూపతి. ఈ నేపథ్యంలో అంతే వైవిద్యభరితంగా 'మహాసముద్రం' చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన తాజాగా చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిత్రంలో 'మహా' అనే రోల్‌లో అదితిరావు హైదరి కనిపించనుందని పేర్కొంటూ ఈ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో అదితిరావు హైదరి తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే 'లైట్ హౌస్ ఆఫ్ మహాసముద్రం' అంటూ మరో హీరోయిన్ అను ఇమ్మానుయేల్ లుక్ బయటపెట్టిన ఆయన తాజాగా అదితిరావు లుక్ కూడా రివీల్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. గతంలో ఈ సినిమా కథ 'మహా' అనే అమ్మాయి చుట్టూ నడుస్తుందని వార్తలు వినిపించాయి. తాజా పోస్టర్ అదే నిజం అని తెలిపేలా ఉంది. డైరెక్టర్ అజయ్ భూపతి స్టైల్ లోనే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ రోల్స్ చాలా కీలకంగా ఉండనున్నాయట. ఇకపోతే ఇద్దరు హీరోలు శర్వానంద్‌, సిద్ధార్థ్ రోల్స్ కూడా సినిమాలో చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నాయని ఇప్పటికే విడుదలైన 'మహాసముద్రం' పోస్టర్స్ చెప్పకనే చెప్పేశాయి. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా 'మహాసముద్రం' రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OGHkc7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...