Sunday, 11 April 2021

Khiladi Teaser: డిఫరెంట్ షేడ్స్‌లో రవితేజ! ఇక మాస్ జాతర షురూ..

ఇటీవలే 'క్రాక్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కేసిన రవితేజ.. ఈ సారి 'ఖిలాడి'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఉన్న అంచనాలు పెంచేశారు. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 'ఖిలాడి' టీజర్ విడుదల చేశారు చిత్ర దర్శకనిర్మాతలు. ఒక నిమిషం 19 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో రవితేజ యాక్షన్ సీన్స్ చూపించి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహారాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికే ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. థ్రిల్లింగ్, యాక్షన్ కలగలుపుతూ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా 'ఖిలాడి' మూవీని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తుండగా, యాంకర్ అనసూయ మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. తాజాగా విడుదలైన టీజర్‌లో అనసూయను కూడా చూపించడం చిత్రంలో ఆమె రోల్ ఎంత కీలకం అనేది తెలుపుతోంది. రాక్‌ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై మాస్ మహారాజా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mDV044
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...