Sunday, 25 April 2021

రాఘవేంద్రుడి పెళ్లి సంద‌D క్రేజీ అప్‌డేట్.. దర్శకేంద్రుడు ఫిక్సయ్యారిలా! గెట్ రెడీ ఆడియన్స్..

సీనియర్ డైరెక్టర్, దర్శకేంద్రుడు ఇటీవలే '' సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 25 ఏళ్ల క్రింద ఇదే 'పెళ్లి సందడి' పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన ఆయన.. ఇప్పుడు మోడ్రన్ 'పెళ్లి సందD'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. 1996లో విడుద‌లై ఏడాది పాటు ప్ర‌ద‌ర్శించ‌బ‌డి అద్భుత‌ విజ‌యాన్ని సాధించ‌డ‌మే గాక బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచి పాతికేళ్లుగా శ్రోతలను అట్రాక్ట్ చేస్తోంది నాటి `పెళ్లిసంద‌డి`. రాఘవేంద్రుడి టేకింగ్, కీరవాణి మ్యూజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ఇప్పటికీ ఆ సాంగ్స్ ఎక్కడోచోట మోగుతూనే ఉంటాయి. దీంతో ఈ సారి మోడ్రన్ 'పెళ్లి సందD'లో పాటలు అంతకుమించి ఉండేలా ప్లాన్ చేశారని టాక్. ఈ సాంగ్స్ నుంచి ఏప్రిల్‌28న ఓ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఏప్రిల్‌ 28 అనేది ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు జీవితంలో విశిష్ట‌మైన రోజు. ఎందుకంటే అప్పట్లో ఏప్రిల్‌28నే ఆయన సూపర్ హిట్ మూవీ `అడివిరాముడు` విడుదలైంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పి బాక్సాఫీస్‌ చరిత్రలో స‌రికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఇక ఏప్రిల్‌28న కె. రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో తన శిష్యుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `బాహుబ‌లి 2` విడుద‌లై సంచలన విజయం నమోదు చేసింది. అలా ఆ డేట్‌కి అత్యంత ప్రాముఖ్య‌త చేకూరింది కాబట్టి అదే రోజున `పెళ్లిసంద‌D` పాట‌ల హంగామా మొదలుపెట్టాలని ఇలా ప్లాన్ చేశారట దర్శకేంద్రుడు. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీర‌వాణి బాణీలు కడుతున్నారు. శ్రీకాంత్ తనయుడు హీరోగా నటిస్తుండగా.. శ్రీ‌లీల హీరోయిన్‌గా నటిస్తోంది. రాఘవేంద్ర రావు ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టనుండగా.. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యిందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RTHjCI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...