Saturday, 24 April 2021

ఆ స్థాయి నుంచి సెలెబ్రిటీ వరకు.. నిజమైన కష్టజీవి.. గెటప్ శ్రీను మొదటి జీతం ఎంతంటే?

బుల్లితెర ప్రేక్షకులకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షోలో గెటప్ శ్రీను వేసే పాత్రలు, చేసే నటన అందరినీ కట్టిపడేస్తుంటుంది. బుల్లితెరపై తన సత్తాను చాటిన శ్రీను.. వెండితెరపై కమెడియన్‌గా దూసుకుపోతోన్నారు. వరుస ప్రాజెక్ట్‌లతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆచార్య వంటి భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. దాదాపు ఇప్పుడు అర డజన్ చిత్రాలతో గెటప్ శ్రీను ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. అయితే బుల్లితెర, వెండితెర మీద ఇంతటి పాపులారిటీని సంపాదించుకున్న శ్రీను కెరీర్ ప్రారంభం కాకముందు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు ఊర్లో పొలం పనులు కూడా చేసేవారు. ఏ పని అయినా కూడా కష్టపడి చేసేవారు. ఇదే విషయాన్ని నాగబాబు ఆ మధ్య తన యూట్యూబ్ చానెల్‌లో చెప్పుకొచ్చారు. గెటప్ శ్రీను ఎంతో కష్టపడేవాడు.. చిన్నప్పటి నుంచి పని చేసుకుంటూ సంపాదించుకునే వాడంటూ నాగబాబు తెలిపారు. అయితే తాజాగా గెటప్ శ్రీను సైతం తన మొదటి సంపాదన గురించి బయటకు చెప్పేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నా.. మొదట అందుకున్న జీతం ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అలా గెటప్ శ్రీను తాజాగా తన మొదటి జీతం గురించి చెప్పుకొచ్చారు. పొలం పనులకు వెళ్తే 40 రూపాయలు వచ్చేవి అని నిర్మోహమాటంగా చెప్పేవారు. అలాంటి స్థాయి నుంచి గెటప్ శ్రీను ఇప్పుడు స్టార్ సెలెబ్రిటీ వరకు ఎదిగారు. బుల్లితెరపై గెటప్ శ్రీను ఎదురులేనట్టుగా దూసుకుపోతోంటారు. తాజాగా ఈ మధ్యే సోలో హీరోగా మారిపోయారు. రాజు యాదవ్ అంటూ అందరినీ మెప్పించేందుకు వస్తున్నారు. గత వారం విడుదల చేసిన చిన్న టీజర్ బాగానే క్లిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dL82tB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...