Saturday, 24 April 2021

ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. బోనీ కపూర్ పోస్ట్‌తో అంతా షాక్

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ప్రస్తుతం సౌత్ మీద కన్నేశారు. ఇప్పుడు వరుసగా దక్షిణాది చిత్రాలను నిర్మిస్తూ ఫుల్ స్పీడ్ మీదున్నారు. పింక్ సినిమాను దక్షిణాదిలో నిర్మిస్తూ ఫుల్ పైసా వసూల్ అన్నట్టుగా దూసుకుపోతోన్నారు. తమిళంలో నేర్కొండ పార్వైగా రీమేక్ చేశారు. అజిత్‌తో సినిమా తీయాలని ఎప్పటి నుంచో ఉన్న బోనీ కపూర్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తీసేశారు. నేర్కొండ పార్వై హిట్ అవ్వడంతో అజిత్‌తో మళ్లీ ఓ సినిమాను రెడీ చేశాడు. అంటూ అజిత్‌తో రచ్చ చేసేందుకు బోనీ కపూర్ రెడీ అయ్యారు. అయితే గత ఏడాది నుంచి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ రావడం లేదు. దీంతో తలా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ మే 1న అజిత్ బర్త్ డే సందర్భంగా వలిమై నుంచి అప్డేట్ రాబోతోందంటూ అభిమానులు తెగ సందడి చేశారు. కానీ వారందరికీ బోనీ కపూర్ ఓ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వలిమై అప్డేట్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మే1న అజిత్ బర్త్ డే అని తెలియకుండానే ఓ అప్డేట్ ఇవ్వాలని ముందే ఫిక్స్ అయ్యాం. మే 1న ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ ప్రస్తుతం కరోనా సునామీలా దూసుకుపోతోంది. ఇప్పుడున్న కష్టకాలంలో సినిమా అప్డేట్లు ఇచ్చేందుకు చిత్రయూనిట్ సుముఖంగా లేదు. అందుకే త్వరలోనే మరో కొత్త డేట్ ప్రకటిస్తాం. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తామని బోనీ కపూర్ ప్రకటించారు. దీంతో అభిమానులు అందరూ నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tSvivE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...