Tuesday, 6 April 2021

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ఆగిపోలేదు.. స్పష్టత ఇచ్చిన నిర్మాత.. సంబరాల్లో ఫ్యాన్స్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ అతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఎన్టీఆర్.. కాంబినేషన్‌లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్తుందనే టాక్ చాలా బలంగా వినిపించింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాకు ముందే ఈ సినిమాని ప్లాన్ చేశారని సమాచారం. గతంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన ‘అరవింత సమేత వీరరాఘవ’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా అనగానే ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని సంతోషం నెలకొంది. ఓవైపు ‘ఆర్‌ఆర్ఆర్’ షూటింగ్‌లో తారక్ బిజీగా ఉన్నాడని తెలిసినా.. ఈ సినిమాకు సంబంధించి ఒక అప్‌డేట్ అయినా రాకపోతుందా.. అని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. అయితే వాళ్ల ఎదురుచూపులకు తగిన సమాధానం మాత్రం రాలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. అయితే ఈ వార్తలకు నిర్మాత ఫుల్‌స్టాప్ పెట్టారు. ఒక సింపుల్ ట్వీట్‌తో ఆయన ఈ వార్తలను కొట్టిపారేశారు. ‘ఇది చాలా మంచి జోక్ గైస్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో తారక్ అభిమానులు మరోసారి సంబరాల్లో మునిగిపోయారు. త్రివిక్రమ్ పాటించే ‘అ’ అక్షరం సెంటిమెంట్‌తో ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు సమాచారం. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఏర్పడిన విపరీత పరిస్థితులు కాస్త మెరుగుపడితే.. ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలోని తారాగణం, ఇతర చిత్ర యూనిట్ సంబంధించిన వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cSxBZm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...