Tuesday, 6 April 2021

‘శాకుంతలం’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. సమంతతో పాటు సినిమాలో మరో స్టార్ హీరోయిన్

దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా ''. ఈ సినిమాలో కావ్యనాయకీ పాత్రలో నటిస్తుండగా.. నాయకుడు దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోషన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సమంత ప్రీ లుక్‌కి విశేష స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త.. సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. కథ ప్రకారం శకుంతలకి ప్రియంవద అనే ఇష్టసఖి ఉంటుంది. ఈ పాత్ర కోసం తొలుత ఈషా రెబ్బాను అనుకున్నారట.. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈషాను ఈ పాత్ర నుంచి తప్పించారని తెలుస్తోంది. ఆమె స్థానంలో తమిళనటి ‘అదితి బాలన్’ను తీసుకున్నారని సమాచారం. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటుందని టాక్ కూడా వినిపిస్తోంది. తమిళంలో 'అరువి' సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు మెచ్చి గుణశేఖర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రని ఆమెకి ఆఫర్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమాకి గుణశేఖర్ సతీమణి నీలిమా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గుణా టీమ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cRDoyr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...