Friday, 9 April 2021

అలా నాపై వస్తున్న వార్తలు నిజం కాదు.. నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చిన రాధికా శరత్ కుమార్

తనపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు . దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు సినీ నటులు కరోనా బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని సదరు నటీనటులు అఫీషియల్‌గా ప్రకటిస్తున్నప్పటికీ.. కొందరు స్టార్స్ విషయంలో అవాస్తవాలు కూడా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటి రాధిక ఆరోగ్యంపై వదంతులు పుట్టుకొచ్చాయి. రాధికకు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఇట్టి వార్తలపై రియాక్ట్ అయ్యారు రాధికా శరత్ కుమార్. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ''మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్ చెబుతున్నా. నాకు కరోనా సోకలేదు. నేను సెంకడ్ డోస్ వేసుకున్నాక మామూలుగా కొంత ఒళ్లు నొప్పులు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉండటమే గాక వృత్తిపరమైన జీవితంలో బిజీ అయ్యాను. నా ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు'' అని రాధిక పేర్కొన్నారు. కాగా, రీసెంట్‌గా శరత్ కుమార్, ఆయన భార్య రాధికకు చెన్నై ప్రత్యేక కోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. 2014లో ఓ సినిమా నిర్మాణం కోసం రేడియ‌న్స్ అనే సంస్థ నుంచి అప్పుగా తీసుకున్న సొమ్ము చెల్లించకపోగా, ఆ నగదు రీ పేమెంట్ కోసం సదరు సంస్థకు చెక్ ఇచ్చారు. అయితే ఈ చెక్ బౌన్స్ కావడంతో కోర్టు విచారణ చేపట్టి రాధిక దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష విధించిందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కూడా తన ట్వీట్‌లో ప్రస్తావించిన రాధిక తాము న్యాయం కోసం కోర్టుతో ఫైట్ చేస్తామని చెప్పారు. ఈ మేరకు రాధిక చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dSsHLr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...