Friday, 9 April 2021

మాస్‌ మహరాజ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘ఖిలాడి’ వచ్చేస్తున్నాడు.. టీజర్ ఎప్పుడంటే..

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన స్వశక్తితో స్టార్ హీరో స్టేటస్‌ని సాధించాడు మాస్ మహరాజ రవితేజ. సినిమా అంటే అందులో టన్నుల కొద్ది ఎంటర్‌టైంట్ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేసేలా ఆయన చిత్రాలు ఉంటాయి. గత కొంతకాలంగా సరైన హిట్ లేని రవితేజ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ సినిమా విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ.. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 10.08 గంటలకు ఈ సినిమా టీజర్‌ని విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. రవితేజా ఎనర్జీ, బాడీ లాంగ్వేజీకి తగినట్లుగా ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మే 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PFxEiD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...