Wednesday, 21 April 2021

ముద్దులు, హగ్గులతో బుట్టబొమ్మ రచ్చ.. గాల్లో తేలిపోతోన్న పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా పేరు ముందు వరుసలో ఉంటుంది. అయితే బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న పూజా హెగ్డే సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతున్నారు. సోషల్ మీడియాలో పూజా హెగ్డేకు రోజు రోజుకు ఫాలోవర్లు పెరుగుతున్నారు. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంటూ రచ్చ చేస్తున్నారు. అయితే పూజా హెగ్డే ఎక్కువగా వివాదాల జోలికి వెళ్లదు. కానీ గత ఏడాది ఆమె సమంత మీద చేసిన కామెంట్లతో కాస్త నెగెటివిటీ పెరిగింది. సమంత ఏమీ అంత క్యూట్‌గా అనిపించడం లేదంటూ పూజా హెగ్డే కామెంట్ చేశారు. అయితే ఆ తరువాత ఆమె తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందంటూ ప్లేట్ తిప్పేశారు. అలా చివరకు అది సమంత, పూజా హెగ్డేల అభిమానుల మధ్య యుద్దంలా మారిపోయింది. అలా అప్పటి నుంచి సమంత, పూజా హెగ్డేల మధ్య ఓ పోలిక పెడుతూనే వస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్ల విషయంలో ఒకే మీటర్‌లో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇన్ స్టాగ్రాం ఫాలోవర్ల విషయంలో ఇద్దరూ కాస్త తేడాతోనే ఉన్నారు. గత నెలలోనే సమంత ఫాలోవర్లు 13 మిలియన్లకు చేరుకున్నారు. ఇప్పుడు ఆ ఫీట్‌ను పూజా హెగ్డే అందుకున్నారు. తనకు 13 మిలియన్ల మంది ఫాలోవర్ల వచ్చి చేరడంతో పూజా హెగ్డే గాల్లో తేలిపోతోన్నారు. తన అభిమానులు, ఫాలోవర్లందరికీ కూడా ముద్దులు, హగ్గులు విసురుతున్నారు. వర్చువల్ హగ్స్ అంటూ ఎమోజీలను షేర్ చేస్తూ ముద్దులు కూడా పెట్టేస్తున్నారు. 13 మిలియన్లకు చేరకున్నాను.. అందరికీ థ్యాంక్స్ లవ్లీస్.. మీ అందరికీ హగ్గులు, ముద్దులను పంపిస్తున్నాను అంటూ ఓ క్యూట్ ఫోటోను షేర్ చేశారు. పూజా హెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, ఆచార్య చిత్రాలతో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3atNCn2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...