Thursday, 29 April 2021

వాటి సైజు ఎంత అని అడిగారు.. నా టీనేజ్ నుంచే అవన్నీ! అయితే ఏంటంటూ ఇలియానా ఓపెన్ కామెంట్స్

హీరోయిన్ల బాడీ షేమింగ్ గురించి నెటిజన్స్ కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. టెక్నాలజీ ఎంత పెరుగుతుంటే సెలబ్రిటీలకు- సాధారణ ప్రజలకు మధ్యదూరం అంత తగ్గిపోతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా తమ మనసులో ఏముందో సెలబ్రిటీల ముందు పెట్టేసే అవకాశం ఉండటంతో కొంతమంది నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల గురించి ఇబ్బందికర కామెంట్స్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. గోవా బ్యూటీ ఇలియానాకు ఇలాంటి అనుభవాలు లెక్కలేనన్ని ఉన్నాయట. తాజాగా ఈ విషయాన్ని బయటపెడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఇల్లీ బేబీ. తన శరీరాకృతి గురించి ఎన్నోసార్లు వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పింది. మానసిక వేదనకు గురైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయంటూ ఓపెన్ అయింది. తన టీనేజ్ నుంచే అలాంటి అనుభవాలను భరిస్తూ వస్తున్నానని, కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని కామెంట్స్ చూశానని చెప్పింది. ఏకంగా నీ పిరుదుల సైజు ఎంత? సర్జరీ చేయించుకోవచ్చుగా అని మెసేజ్ పెట్టేవారని చెప్పుకొచ్చింది. సామజిక మాధ్యమాల్లో రోజూ తనకు వచ్చే మెసేజ్‌లలో కనీసం 10 మెసేజ్‌లు ఇలాంటివే ఉంటాయని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో అలాంటి మెసేజీలు చూసి తన మీద తనకే అసహ్యం కలిగిందని ఇలియానా పేర్కొంది. మహిళల్లో హార్మోన్ల లోపం వల్ల శరీరంలో చాలా రకాల మార్పులు వస్తుంటాయి.. అలాగని ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని ఇలియానా అంటోంది. శారీరక సమస్యలే ఓ ఇబ్బంది అనుకుంటే నెటిజన్స్ పెట్టే ఈ కామెంట్స్ మరింత బాధపెడుతుంటాయని ఆమె తెలిపింది. ఒక్కొక్కరి శరీరాకృతి ఒక్కోలా ఉంటుంది. అది వారి లోపంగా భావించకూడదనే విషయాన్ని నెటిజన్లు తెలుసుకోవాలని ఇలియానా చెప్పింది. మొదట్లో ఇలాంటి కామెంట్స్ చూసి మానసికంగా కృంగిపోయా కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి పట్టించుకోవడం మానేశానని ఆమె తెలిపింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఇల్లీ బేబీ.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QF7hK0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...