గతేడాది మొత్తం దేశాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తీవ్రంగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది ఇదే సమయానికి ఎలాగైతే కేసులు పెద్ద ఎత్తున పెరిగాయో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుండటం దేశ ప్రజలను కలవరపెడుతోంది. సాదారణ ప్రజలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సెకండ్ వేవ్ కరోనా బారిన పడుతున్నారు. హమ్మయ్య! మెల్లగా కరోనా వెళ్లిపోతోంది. వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. ఇక సినిమా షూటింగ్స్‌కి ఎలాంటి ఆటంకం ఉండదు అని సినీ ఇండస్ట్రీ సంతోషపడే లోపే పలువురు సినీ నటులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని తెలుపుతూ స్వయంగా ట్వీట్ చేశారు అక్షయ్. ''ఓ విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు ఉదయాన్నే నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. నిబంధనలను అనుసరిస్తూ వెంటనే నేను సెల్ఫ్ క్వారంటైన్ అయ్యాను. అలాగే కరోనాకు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా. ఇటీవల కాలంలో నాతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్ చేయించుకొని జాగ్రత్తగా ఉండండని రిక్వెస్ట్ చేస్తున్నా. తిరిగి త్వరలోనే కెమెరా ముందుకొస్తా'' అని అక్షయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sQnxWv
v
No comments:
Post a Comment