సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెర దించుతూ.. కొద్ది రోజుల క్రితం మహేశ్‌లో సినిమా ప్రకటించాడు జక్కన్న. ప్రస్తుతం ‘’ షూటింగ్‌లో ఉన్న రాజమౌళి ఆ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ఏ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది.. మహేశ్‌ని రాజమౌళి ఎలా చూపిస్తాడా..? అని ఇప్పటికే అభిమానులు అంచనాలు వేయడం ప్రారంభించారు. ప్రస్తుతం మహేశ్ బాబు ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘’ సినిమా చేస్తున్నాడు. అయితే రెండో దశలో కరోనా రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతుండటంతో ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. ఇదిలా ఉండగా.. మహేశ్-రాజమౌళి సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా పూర్తిగా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే మహేశ్ కోసం ఫారెస్ట్ అడ్వెంచర్ కథని సిద్ధం చేశారని సమాచారం. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితులు కాస్త మెరుగుపడితే.. ఈ విజయదశమికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అంతేకాక.. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి.. వచ్చే ఏడాది సంక్రాంతి వరకూ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం త్వరలో తెలిసే అవకాశం ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tzo3Z7
v
No comments:
Post a Comment