Tuesday, 20 April 2021

మరిదిపై ప్రేమ కురిపించిన చందమామ.. చెల్లి భర్తపై కాజల్ అలా

అందాల చందమామ పెళ్లి తరువాత సోషల్ మీడియా మరింత దూకుడుగా ఉంటున్నారు. సినిమా సంగతులే కాకుండా వ్యక్తిగత విషయాలు ఎక్కువగా పంచుకుంటున్నారు. గౌతమ్ కిచ్లూ విషయాలు, చెల్లి నిషా అగర్వాల్‌కు సంబంధించిన విషయాలు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ కొన్ని పోస్ట్‌లు చేశారు. అందులో తన మరిదిపై ఉన్న ప్రేమను అందరికీ తెలిసేలా చేశారు. భర్త్ కరణ్ వాలేచాపై కాజల్ చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. నిషా అగర్వాల్ భర్త్ కరణ్ బర్త్ డేను కాజల్ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు కాజల్ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నిషా అగర్వాల్ కరణ్ వాలేచాకు 2013లో వివాహాం జరిగిన సంగతి తెలిసిందే. అక్క కంటే ముందుగా నిషా అగర్వాల్ పెళ్లి చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక కాజల్ కెరీర్‌ను ద‌ృష్టిలో ఉంచుకుని కాస్త ఆలస్యంగా వివాహాం చేసుకున్నారు. అలా మొత్తానికి తన స్నేహితుడు, ప్రియుడు అయినా గౌతమ్ కిచ్లూని కాజల్ గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. కాజల్ అగర్వాల్ ఎక్కువగా తన చెల్లి కొడుకుతో ఆడుకుంటుంటారు. చిన్న పిల్లాడైన ఇషాన్ వాలేచాతో ఆడుకుంటున్న వీడియాలను షేర్ చేస్తూ కాజల్ సందడి చేస్తుంటారు. పెద్దమ్మగా కాజల్ ఇషాన్‌కు ప్రేమను పంచుతుంటారు. అయితే మొన్న నిషా అగర్వాల్ భర్త్ కరణ్ పుట్టినరోజు సందర్భంగా అందరూ కలిసి సందడి చేసినట్టు కనిపిస్తోంది. ఇక తన మరిదిపై కాజల్ చేసిన కామెంట్లు బాగానే వైరల్ అవుతున్నాయి. మంచి సోదరుడు.. మా డార్లింగ్ అంటూ తన పెళ్లిలో కరణ్ చేసిన పనులను కాజల్ తలుచుకున్నారు. కరణ్ తమ కోసం ఎంతగా కష్టపడ్డాడో తెలిపే ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ రెండు ఫ్యామిలీలు కలిసి దిగిన ఫోటోలను కాజల్ షేర్ చేశారు. పార్టీలంటూ ఇరు కుటుంబాలు చేసిన రచ్చను కాజల్ బయటపెట్టేశారు. ఇక తన మరిదికి స్పెషల్ విషెస్ చెబుతూ కాజల్ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tzQnul
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...