Monday, 19 April 2021

టాలెంటెడ్ డైరెక్టర్‌తో రామ్ నెక్ట్స్ మూవీ.. నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్ పక్కా అంటున్న ఫ్యాన్స్..?

టాలీవుడ్‌లో పక్కా కామెడీతో పాటు కమర్షియల్ విలువలతో సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకుడు . తొలి సినిమా ‘పటాస్‌’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అనిల్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస హిట్లతో స్టార్ డైరెక్టర్ పొజిషన్‌కి వచ్చేశాడు. అంతేకాదు.. ఇప్పుడు స్టార్ హీరోలు అందరికీ అతను హాట్ ఫేవరెట్‌గా మారిపోయాడు. గత ఏడాది సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న అనిల్.. ప్రస్తుతం ‘ఎఫ్‌3’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా 2019లో వచ్చిన ‘ఎఫ్2’ సినిమా సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా తర్వాత అనిల్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దీనిపై రోజుకో రూమర్ వినిపిస్తోంది. తాజాగా మరో వార్త సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో చేయనున్నాడట. ‘రెడ్’ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించిన రామ్.. ఊహించినంత విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ సినిమాలో డబుల్‌ యాక్షన్‌తో మెప్పించినా.. కలెక్షన్ల పరంగా నిరాశే ఎదురైంది. ఇక రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో అతనికి జోడీగా కృతి శెట్టి చేస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత రామ్.. అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. అనిల్ ఇప్పటికే రామ్‌కు కథ వినిపించగా.. అతను ఓకే చెప్పినట్లు కూడా సమాచారం. రవితేజ హీరోగా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ సినిమాని ముందు రామ్‌తోనే అనుకున్నారట. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. అయితే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈసారి అనిల్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని రామ్ బలంగా ఫిక్స్ అయ్యాడట. దీంతో అనిల్ ‘ఎఫ్3’ సినిమా పూర్తి కాగానే.. రామ్-అనిల్ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని.. ఇది కూడా నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3txsm7t
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...