Monday, 19 April 2021

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుమిత్ర భ‌వే కన్నుమూత

మరాఠీ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకురాలు, నిర్మాత, నేషనల్ అవార్డు విన్నింగ్ సుమిత్ర భవే కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 78 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. పూణే లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (సోమవారం) ఉదయం తుది శ్వాస విడిచారు. సుమిత్ర మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపం తెలుపుతున్నారు. మరాఠీ సినీ ప‌రిశ్ర‌మ‌లో కీలకంగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీని కొత్త దారిలో నడిపిన ఘనత సుమిత్ర భవే సొంతం. కో- డైరెక్టర్ సునీల్‌ సుక్తాంకర్‌తో కలిసి పనిచేసిన ఆమె ఇన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు రూపొందించారు. ఈ ఇద్దరి కాంబోలో దాదాపు 50కి పైగా లఘు చిత్రాలు, 4 టీవీ సీరియళ్లు, 17 సినిమాలు వచ్చాయి. 2016 సంవత్సరంలో వీళ్లు రూపొందించిన 'కాసవ్'‌ సినిమాకు ప్రతిష్టాత్మక గోల్డెన్‌ లోటస్‌ నేషనల్‌ అవార్డు లభించింది. సుమిత్ర భవే ఇకలేరనే వార్తతో మరాఠీ సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, మూవీస్‌తో సోషల్ మెసేజ్ ఇచ్చిన సుమిత్ర మరణం మరాఠీ సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన చెందుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3spkBPy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...