Monday, 12 April 2021

మళ్లీ నోటికొచ్చినట్టు వాగిన సాక్రిఫైజ్ స్టార్.. రాకేశ్ మాస్టర్‌ ముందే అలా! లైవ్‌లోనే తన్నులు తప్పలేదండోయ్..

సాక్రిఫైజ్ స్టార్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో నోటికొచ్చినట్లు మాట్లాడి ఓవర్ సైట్ ఫేమస్ అయ్యాడు సునిశిత్. ఇండస్ట్రీలో తనను ఎదగనివ్వకుండా ఎన్టీఆర్‌, మహేశ్ బాబు వంటి స్టార్స్ తొక్కేశారని సెన్సెషనల్ కామెంట్స్ చేశాడు. తాను వదులుకోవడం వల్లే వీరికి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయంటూ ఇతను అనడంతో నెటిజన్లు సాక్రిఫైజ్ స్టార్ అంటూ బిరుదు ఇచ్చారు. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వన్ నేనొక్కడినే’ కథని తనకే ముందు చెప్పారని.. తనని హీరోగా పెట్టి షూటింగ్ కూడా చేశారని.. ఆ తర్వాత మహేశ్ బాబు తన నుంచి ఈ సినిమా లాక్కున్నాడంటూ.. కామెంట్స్ చేశాడు. అంతటితో ఆగని అతను తనకు ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయని.. ముఖ్యంగా నటి లావణ్య త్రిపాఠి తనతో డేటింగ్ చేసిందని.. ఆ తర్వాత తమకు పెళ్లి కూడా జరిగిందని కామెంట్స్ చేశాడు అతను. దీంతో లావణ్య ఫ్యాన్స్ అతనిపై పోలీస్‌ కేసు పెట్టారు. అయితే తాజాగా సునిశిత్, రాకేశ్ మాస్టర్‌కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలే రాకేశ్ మాస్టర్.. అతని ముందు సునిశిత్ ఇష్టమొచ్చినట్లే ఊరుకుంటాడా.. లైవ్‌లోనే చితకబాదాడు. అన్ని ఇంటర్వ్యూలో లానే సునిశిత్ ఈ ఇంటర్య్వూలో ‘వన్‌ సినిమాకి సుకుమార్ తనని ఆడిషన్ చేసి.. 20 శాతం షూటింగ్ చేశారు’ అంటూ వాగాడు. దీంతో చిర్రెత్తుకుపోయిన అతన్ని చితకబాదాడు. సునిశిత్‌ని తలపై చెంపలపై ఇష్టమొచ్చినట్లు వాయించాడు. ఆ తర్వాత బెత్తం తెప్పించుకొని మరీ సునిశిత్‌కి కోటింగ్ ఇచ్చాడు రాకేశ్ మాస్టర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OJDP4E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...