Monday, 12 April 2021

ఎన్టీఆర్30 అప్‌డేట్ వచ్చేసింది.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌తో మరోసారి జతకట్టనున్న తారక్.. ఫ్యాన్స్‌కి పండగే..

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. తదుపరి చిత్రం ఎవరితో చేస్తాడని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమాని ప్రకటించారు. కానీ, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలు అన్నింటికీ చెక్ పెడుతూ.. సోమవారం విడుదలైన ఈ ప్రకటన తారక్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఎన్టీఆర్ తన 30వ చిత్రం సెన్సేషనల్ డైరక్టర్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం ఏ రేంజ్‌లో సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో మరోసారి ఈ బ్లాక్‌బస్టర్ కాంబోలో సినిమా వస్తుందనగానే.. భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఎన్టీఆర్30’, ‘ఎన్టీఆర్‌కొరటాల2’గా పలవబడుతున్న ఈ చిత్రం నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే ముహూర్త కార్యక్రమాలు జరుపుకొని.. జూన్ రెండవ భాగంలో షూటింగ్ ప్రారంభించుకుంటుందని నిర్మాతలు తెలిపారు. ‘‘ఏప్రిల్ 29, 2022 వ తేదీన పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌పై సహజం గానే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా, భారీ స్థాయిలో ఈ చిత్రం ఉంటుంది. ఇతర వివరాలను ముహూర్తం రోజున తెలియజేస్తాం’’ అని నిర్మాతలు అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3datbNL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...