Thursday, 8 April 2021

త్వరలో ఓటీటీలో ‘జాతిరత్నాలు’.. బుల్లితెరపై కూడా అదే రేంజ్‌లో సందడి చేస్తుందా..

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో.. యువ దర్శకుడు కేవీ అనుదీప్ డైరెక్షన్‌లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘జాతిరత్నాలు’. గత ఏడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడి ఈ ఏడాది మార్చి 11న థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే ఈ సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది. మిగితా సినిమాల్లా కాకుండా విభిన్నమైన పద్దతుల్లో సినిమాని ప్రమోట్ చేయడం.. ముఖ్యంగా డైరెక్టర్ అనుదీప్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు చాలా ప్టస్ పాయింట్ అయ్యాయి. జోగిపేట్ అనే ప్రాంతం నుంచి ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ వచ్చిన యువకులు అనూహ్యంగా ఓ మర్డర్ కేసులో చిక్కుకోవడం.. ఆ తర్వాత వారి జీవితాల్లో వచ్చిన మలుపుుల ఏంటి అనేది ప్రధాన అంశంగా ఈ సినిమా సాగుతుంది. ప్రతి సీను, ప్రతి డైలాగ్‌లో కామెడీని నింపి.. థియేటర్‌కి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వు కునేలా చేశాడు దర్శకుడు అనుదీప్. ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. పెట్టిన బడ్జెట్ కంటే దాదాపు 20 రేట్ల వసూళ్లు సాధించిందీ సినిమా. ఇక వెండితెరపై సందడి చేసిన ఈ సినిమా త్వరలో బుల్లితెరపై అల్లరి చేసేందుకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరి వెండితెరపై నవ్వులతో తెగ సందడి చేసిన ఈ సినిమా బుల్లితెరపై కూడా అదే స్థాయిలో నవ్వులు పండించి.. ఎలాంటి రికార్డులు సాధిస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. స్వప్న సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకి మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. నరేశ్, మురళీ శర్మ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్ తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d12fA4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...