Thursday, 8 April 2021

పబ్లిక్‌గా మోనాల్‌కి కిస్.. నీ వల్లే పిచ్చోడినయ్యానంటూ బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన కుర్రోడు!

బిగ్ బాస్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా! హీరోయిన్‌గా రాని గుర్తింపును బిగ్ బాస్ ద్వారా పట్టేసింది మోనాల్ గజ్జర్. హౌస్‌లో మొదట అభిజీత్, ఆ తర్వాత అఖిల్‌తో ఆమె చేసిన రొమాంటిక్ జర్నీ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అలా బిగ్ బాస్ సీజన్ మొత్తం మోనాల్ పేరు మారుమోగిన సంగతి మనందరికీ తెలుసు. అయితే షో ముగిశాక కూడా మోనాల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే మోనాల్‌కి ముద్దు పెట్టేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. బిగ్ బాస్ తెచ్చిపెట్టిన ఫేమ్ మోనాల్ కెరీర్‌కి బాగా ప్లస్ అవుతోంది. అటు వెండితెర, ఇటు బుల్లితెర దర్శక నిర్మాతల నుంచి ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే 'అల్లుడు అదుర్స్' సినిమాలో 'రంభ ఊర్వశి మేనక' ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకున్న ఈ భామ.. ప్రస్తుతం బుల్లితెరపై స్టార్‌ మాలో వస్తున్న డ్యాన్స్‌+‌ రియాలిటీ షోకు జడ్జ్‌గా చేస్తోంది. ఈ షోకి వచ్చిన మొదట్లో డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో కాస్త విమర్శలు ఎదురైనా ఈ మధ్య మాత్రం బాగా హైలైట్ అవుతోంది మోనాల్. ఈ షోలో టీమ్ రెండు వారాల క్రితం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మోనాల్‌ మెప్పుపొందాడు. కన్నా టీం పర్ఫామెన్స్‌కు అట్రాక్ట్ అయిన మోనాల్‌ కన్నా మాస్టర్‌ను తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. ఆ సమయంలో మోనాల్ మేడమ్ కోసం ఏదైనా చేస్తానని కన్నా చెప్పగా.. తనకు ఇష్టమైన పట్టు వస్త్రాలు కూడా వేసుకొస్తావా అని యాంకర్ ఓంకార్‌ అడిగాడు. మేడమ్‌ చేప్తే తప్పకుండా వేసుకోస్తానంటూ సమాధానం ఇచ్చిన కన్నా.. ఈ వారం అన్నంత పని చేశాడు. అంతేకాదు అందరిముందే మోనాల్‌కి ముద్దు పెట్టి షాకిచ్చాడు. తాజాగా డ్యాన్స్‌+‌ షో ప్రోమో రిలీజ్ కాగా అందులో మోనాల్- కన్నా ముద్దు సీన్ బాగా హైలైట్ అవుతోంది. పట్టు వస్త్రాలతో వచ్చిన కన్నా మాస్టర్ మోనాల్‌ని స్టేజి మీదకు తీసుకొచ్చి మరీ ఆమె చేతిపై కిస్ చేశాడు. నీ వల్లే పిచ్చోనయ్యానంటూ ఆమెతో స్టెప్పులేసి గులాబీ పువ్వు కూడా ఇచ్చేశాడు. అయితే మోనాల్ ఈ విషయాన్ని స్పోర్టివ్‌గా తీసుకొని ఆనందంగా అతనితో కాలు కదిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q82joB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...