Friday, 2 April 2021

‘పుష్ఫ’ రాజ్.. లోడు దింపతాండం.. సిద్ధంగా ఉండండీ.. అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్ ఇదిగో

సినిమా సినిమాకి వేరియేషన్ చూపించడంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఎప్పుడూ ముందుంటారు. ప్రతీ సినిమాలో కొత్తరకం స్టైల్‌తో, బాడీ లాంగ్వేజీతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇప్పటివరకూ స్టైలిష్, క్లాస్ పాత్రల్లో మాత్రమే కనిపించిన బన్నీ.. ‘పుష్ప’ రాజ్‌గా ఊరమాస్ గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో బన్నీ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే చాలాకాలంగా ‘పుష్ప’ సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ అందకపోవడంతో బన్నీ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. అయితే ఈ నెల 8వ తేదీన బన్నీ పుట్టినరోజుని పురస్కరించుకొని ఫ్యాన్స్‌కి భారీ ట్రీట్ అందించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఇందుకు సంకేతంగా ‘లోడు దింపతాండం’ అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఇందులో భాగంగా ‘పుష్ప రాజ్’ ప్రీలూడ్‌ని శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ప్రీలూడ్ కోసం తెలుగు సినీ అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌‌గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో.. ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31I2Z6E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...