Friday, 30 April 2021

మరో పాన్ ఇండియా సినిమాను లైన్‌లో పెట్టిన రానా.. ఫుల్ జోష్‌లో దగ్గుబాటి వారసుడు

వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు దగ్గుబాటి వారసుడు, స్టార్ హీరో . వైవిధ్యభరితమైన కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు రావడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 'లీడర్', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' లాంటి కొత్తదనంతో కూడిన కథలతో ఆకట్టుకున్నారు. అదే జోష్‌లో మరిన్ని విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న రానా.. మరో పాన్ ఇండియా సినిమాకు కమిటయ్యారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఈ సినిమా నిర్మించనున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా 'టాప్ హీరో', 'దేవుడు', ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ', రాజేంద్రప్రసాద్ హీరోగా 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ 'ఇమైక్క నొడిగల్'ను తెలుగులో 'అంజలి సిబిఐ'గా విడుదల చేశారు. అయితే కొంత విరామం తర్వాత రానా దగ్గుబాటి హీరోగా ఈ భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు ఆచంట గోపినాథ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా కాంబోలో తెరకెక్కుతున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుందని మేకర్స్ చెప్పారు. కథ, కథనం, హీరో పాత్ర కొత్తగా ఉంటాయని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్ర దర్శకుడు, సాంకేతిక నిపుణులు, హీరోయిన్ తదితర వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t7kyZ5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...