Friday, 30 April 2021

ఇలాంటి సమయంలోనే కలిసికట్టుగా ఉండాలి.. వారి కోసం సీపీ సజ్జనార్‌తో కలిసి సమంత అలా!

ప్రస్తుతం దేశంలోని పరిస్థితి, వైద్య సదుపాయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు కరోనా దాడి చేస్తుంటే.. మరో వైపు వైద్య సదుపాయాలు లేక, ప్రాణవాయువు కరువై కొన్ని వేల మంది మరణిస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ఫ్యాక్టరీల మీద ఆధారపడ్డాయి. అయితే సరఫరా లేక ఎంతో మంది బతుకులు గాల్లో కలిసిపోతోన్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని నడి రోడ్డు మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరా లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. ఇలాంటి కష్టకాలంలో కొందరికైనా సాయపడాలి అంటూ ముందుకు వచ్చారు. సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చేసే సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. తాజాగా కోవిడ్ పేషెంట్స్ కోసం సమంత ముందుకు వచ్చారు. ఒక్కోసారి వింత పరిస్థితి, కష్ట కాలం వస్తుంటుంది.. అలాంటి సమయంలోనే మనమంతా కలిసి ముందుకు రావాలి.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్స్ అవసరం ఉన్నవాళ్ల కోసం సాయం చేసేందుకు డొనేట్‌కేఆర్ట్ అనే సంస్థతో కలిసి ప్రత్యూష సంస్థ కూడా ముందుకు వచ్చింది. విరాళాలు సేకరించి అవసరంలో ఉన్న వారికి వైద్య సదుపాయం, ఆక్సిజన్ సిలిండర్ ఇలా ఏ అవసం ఉన్నా కూడా సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. మాకు సజ్జనార్ గారి మద్దతు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. వారి సహకారంతో ఇంకా ముందుకు వెళ్తున్నాం.. మీరు ఇచ్చే ప్రతీ చిన్న మొత్తం ఎవరో ఒకరికి సాయపడుతుంది. మీకు చేతనైన సాయం చేయాలని అందరినీ కోరుతున్నాను. ఆపదలో ఉన్న ఏ ఒక్కరికైనా సాయం చేసేందుకు మనం కారణం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కష్టకాలాన్ని కూడా మనం దాటేస్తాం.. అంటూ సమంత చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e7FD1k
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...