Tuesday, 6 April 2021

మరో పిరియాడిక్ మూవీలో హీరో రానా.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కొత్త దర్శకుడితో

‘లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన దగ్గుబాటి రానా.. ఆ తర్వాత విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు. రానా సినిమా అంటే రొటిన్‌కి భిన్నంగా ఉంటుందనే నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగేలా చేశాడు. బాహుబలి చిత్రంతో సూపర్‌‌హిట్ అందుకొని దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ బేస్ సంపాదించుకున్న రానాకు.. ఆ తర్వాత ఊహించినంత హిట్లు రాలేదు. ఇటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తన ఫేట్‌ను పరిక్షించుకొనే ప్రయత్నం చేసినా.. రానాకు ఫలితం మాత్రం ప్రతికూలంగానే వచ్చింది. ఇక లాక్‌డౌన్ తర్వాత రానా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘అరణ్య’.ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించారు. కానీ, ఈ సినిమా టాక్ పరంగా బాగానే ఉన్నా... కలెక్షన్స్ మాత్రం రాబట్ట లేకపోయింది. ‘అరణ్య’ తర్వాత రానా ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియమ్’ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో రానా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే కెరీర్ ఆరంభం నుంచి సోలో హీరోగా ఊహించినంత హిట్ అందుకోలేకపోయిన రానా.. ఈసారి ఎలాగైనా దాన్ని సాధించాలనే పట్టుదలతో ఉన్నాడని తెలుస్తోంది. ఇందుకోసం మరోసారి ఓ సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యాడట ఈ దగ్గుబాటి హీరో. 1940 పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో రాసిన ఓ కథకి ఇప్పటికే రానా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మంచి యాక్షన్‌తో పాటు ఎమెషనల్ కంటెంట్‌తో కూడిన కథ కావడంతో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించారట. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన వెంకీని ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయమవనున్నాడు.. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాని వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకువెళ్లేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wsxED0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...