Thursday, 29 April 2021

‘ఉప్పెన’లాంటి టీఆర్పీ.. నేషనల్ వైడ్ ట్రెండ్.. దుమ్ములేపిన క‌ృతి శెట్టి-వైష్ణవ్ తేజ్

సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆడియో పరంగా సోషల్ మీడియాలో వందల మిలియన్లను కొల్లగొట్టేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టి దుమ్ములేపేసింది. అలా ఉప్పెన సినిమా ప్రతీ చోటా తన సత్తా చాటుకుంది. ఇప్పుడు బుల్లితెరపైనా తన హవాను చూపించింది. గత వారం బుల్లితెరపై వరల్డ్ ప్రీమియర్‌గా ప్రసారమైన ఉప్పెన అదిరిపోయే టీఆర్పీని సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు తాజాగా ఉప్పెన సినిమా నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అవుతోంది. మెగా హీరో అనే ఇమేజ్‌తో వచ్చినా కూడా ఉప్పెన సినిమాలోని కథ, అతని నటన సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇక ముఖ్యంగా ఉప్పెన సినిమాకు అందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోతో సినిమా స్థాయి పెరిగింది. ఇక బుచ్చిబాబు సానా తెరకెక్కించిన విధానం, కథ, కథనం, మాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలకంగా మారింది. అలా అందరూ కలిసి ఉప్పెన సినిమాను అద్భుతంగా మలిచారు. కరోనా లాంటి సమయంలోనూ ఉప్పెనలాంటి కలెక్షన్లు వచ్చాయి. వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఈ ఏడాదికి మొదటి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాంటి ఉప్పెన ఇప్పుడు బుల్లితెర మీదా రచ్చ చేయడం ప్రారంభించింది. గత వారం స్టార్ మాలో ప్రసారమైన ఈ మూవీకి 18.5 టీఆర్పీ వచ్చింది. అలా వెండితెర మీద బ్లాక్ బస్టర్ అయిన ఉప్పెన బుల్లితెర మీదా రికార్డులు క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఉప్పెన ట్రెండ్ అవుతోంది. ఇక నెట్ ఫ్లిక్స్‌లోనూ ఉప్పెన దూసుకుపోతోంది. ఓ డెబ్యూ హీరోకు బుల్లితెర మీద ఇలాంటి టీఆర్పీ రావడం రికార్డ్ అంటూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gMxGAc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...