Thursday, 22 April 2021

కెమెరా ముందు ఇలా తెరవెనుక అలా! ఇదీ ఫన్ బకెట్ భార్గవ్ క్యారెక్టర్‌.. తెరపైకి మరో అమ్మాయి

గత మూడు నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా ఇష్యూనే నడుస్తోంది. మైనర్‌ బాలికపై అత్యాచారాని పాల్పడ్డాడనే ఆరోపణలతో అరెస్ట్ అయిన ఈ కుర్రాడి గురించిన విషయాలు సంచలనంగా మారాయి. సదరు అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌పై ఈ నెల 16న పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ‘దిశ’, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసుల విచారణలో తేలిన కొన్ని విషయాలు సెన్సేషన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసపెట్టి అతని వీడియోల్లో నటించిన అమ్మాయిలు కెమెరా ముందుకొస్తున్నారు. ఇప్పటికే OMG నిత్య, అమ్మాయి - అబ్బాయి పేరిట వీడియోలు చేసిన మౌనిక కెమెరా ముందుకొచ్చి తమకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, తమ పేర్లు వాడకూడదని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో అమ్మాయి సుమయ ధైర్యంగా ముందుకొచ్చి భార్గవ్ క్యారెక్టర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. కెమెరా ముందు ఒకలా కనిపించే భార్గవ్.. తెరవెనుక మరోలా ప్రవర్తిస్తాడంటూ సంచలన విషయాలు బయటపెట్టింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడితో పని చేసిన అమ్మాయిల వల్లే భార్గవ్‌కు పేరొచ్చినప్పటికీ వారిని కొంచెం కూడా గౌరవించడని, అతనో వుమెనైజర్‌ అంటూ బాంబ్ పేల్చింది ఆ అమ్మాయి. స్టార్టింగ్‌లో భార్గవ్‌తో పని చేస్తుంటే మంచి వాడని అనుకున్నా.. ఆ తర్వాత మెల్లగా అతని గురించి తెలిసి టీమ్ వదిలివెళ్లా అని చెప్పింది సుమయ. తాను చేసేదే కరెక్ట్ అని భార్గవ్ ఫీల్ అయ్యేవాడని, అతను కెమెరా ముందు ఒకలా కెమెరా ఆఫ్ చేశాక మరోలా ఉంటాడని చెప్పుకొచ్చింది. తాను ఏది చేసినా ఏం కాదులే అనే తత్వం అతనిలో ఉంటుందని తెలిపింది. దీంతో భార్గవ్ ఇష్యూ మరింత సీరియస్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PhlyvS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...