Thursday, 22 April 2021

చరణ్ సినిమా కోసం శంకర్ కొత్త స్కెచ్.. రంగంలోకి ముగ్గురు స్టార్స్.. బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే..

గ్రాండ్ లెవల్‌లో చిత్రాలను రూపొందించి.. ఎప్పుడో పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను సంపాదించుకున్నారు దర్శకుడు శంకర్. సినిమా అంటేనే.. భారీ సెట్‌లు, కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్ మాత్రమే కాదు చివర్లో మంచి సందేశం కూడా ఉంటుంది. రోబో 2.0 చిత్రం తర్వాత శంకర్.. తన బ్లాక్‌బస్టర్ చిత్రం భారతీయుడు సినిమాకి సీక్వెల్ ప్రారంభించారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు శంకర్ ప్రకటించారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఆచార్య షూటింగ్ దాదాపు పూర్తికాగా.. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోందని టాక్. అయితే ఈ సినిమా అన్ని ఇండస్ట్రీల ఫ్యాన్స్‌ని ఆకట్టుకోవడానికి శంకర్ ఓ కొత్త స్కెచ్ వేశారట. ఈ సినిమా విషయం అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదట శంకర్. ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకు రావడానికి వివిధ భాషల నుంచి స్టార్స్‌ని ఈ సినిమాలో తీసుకొనే ప్రయత్నాలు ప్రారంభించారట శంకర్. తమిళ ఇండస్ట్రీ నుంచి విజయ్ సేతుపతిని, కన్నడ నుంచి సుదీప్‌ లేదా ఉపేంద్రని తీసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇక టాలీవుడ్ నుంచి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆచార్యలో చరణ్-చిరులను ఒకే స్క్రీన్‌పై చూసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ వార్తే నిజమైతే.. పవన్-చరణ్‌ల కాంబో కూడా వెండితెరపై తళుక్కుమనే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n9Ki5C
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...