Sunday, 25 April 2021

‘ఆచార్య’ సినిమాకు షాక్.. ముఖ్యమైన పాట లీక్.. అలా చేయాలంటూ అభిమానుల డిమాండ్..

టాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్న చిత్రం ‘’. మెగాస్టార్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే విడుదలకు కొన్ని రోజుల ముందే ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ పాట ట్యూన్, లిరిక్స్ సోషల్‌మీడియాలో లీక్ అయినట్లు సమాచారం. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి ‘లాహే.. లాహే’ అంటూ సాగే ఓ పాటని చిత్ర యూనిట్ విడుదల చేశారు. హారిక నారాయణ్ పాడిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సంగీతం సమకూర్చారు. 25 మిలియన్ వ్యూస్‌తో ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతున్న వేళ ఊహించని ట్వీట్ చిత్ర యూనిట్‌ని షాక్‌కి గురి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఉగాది సందర్భంగా వీరిద్దరి రొమాంటిక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. వీరిద్దరి మధ్య సినిమా ఓ డ్యుయెట్ కూడా చిత్రీకరించారట కొరటాల. అందులో ‘నీలాంబరి’ అంటూ సాగే ఓ పాట లిరిక్స్‌తో పాటు సోషల్‌మీడియాలో లీక్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారట. అధికారికంగా పాట విడుదల కాక ముందే ఇలా లీక్ కావడం వారిని బాధకి గురి చేస్తోంది. దీంతో పాటను వీలైనంత త్వరగా విడుదల చేయాలని వాళ్లు దర్శక, నిర్మాతలను కోరుతున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనుసూద్, జిశ్శు సేన్‌గుప్తా, తనికెళ్ల భరణి, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. పరిస్థితులు మళ్లీ మామూలుగా మారితే.. ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32MUkAo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...