‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్‌ని అట్రాక్ట్ చేసిన .. ఆ తర్వాత వచ్చిన ‘ఫలక్‌నామా దాస్’ సినిమాతో మాస్‌లో క్రేజ్ సంపాదించడమే కాక.. ఆ సినిమాతో ‘మాస్ కా దాస్’ అనే పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత అతను ‘హిట్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకు న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్నాడు విశ్వక్. అయితే ఎంతో మంది అభిమానులు ఉన్న విశ్వక్‌సేన్‌కు ఓ హీరోయిన్ అంటే మాత్రం వీర అభిమానం అట. చిన్నతనం నుంచి ఇప్పటివరకూ ఆమె తన అభిమాన నటి అంటున్నాడు విశ్వక్. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. గోవా బ్యూటీ . ఇలియానాపై తనకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేనని చెబుతున్నాడు విశ్వక్‌సేన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘చిన్నప్పటి నుంచి ఇలియానా అంటే పిచ్చి. ఆమె పోస్టర్లు ఎక్కడ కనిపించినా.. ఆగకుండా వెంటనే ఇంటికి తెచ్చుకొనే వాడిని. ఆమె ఫోటోషూట్‌లు ఏది మిస్ కాలేదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నా మనస్సు మారలేదు. ఇలియానాపై అభిమానం అలాగే ఉంది. నా క్రష్ ఎప్పటికీ ఆమెనే’’ అని విశ్వక్ చెప్పాడు. ఇక విశ్వక్ త్వరలో ‘’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందకు రానున్నాడు. ఈ సినిమాలో సిమ్రన్ చౌదరీ, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. ఇక ఈ సినిమాతో పాటు తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘ఓ మై కడవులే’ సినిమా రీమేక్‌లో కూడా అతను నటిస్తున్నట్లు సమాచారం. అయితే కొంతకాలం క్రితం ‘కప్పెళ’ సినిమా రీమేక్‌లో కూడా అతను నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అది అవాస్తవమని విశ్వక్ స్పష్టం చేశాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3exuQML
v
No comments:
Post a Comment