Tuesday, 27 April 2021

కండోమ్ టెస్టర్‌గా రకుల్.. వరుస ఫ్లాప్‌లు రావడంతో డేరింగ్ స్టెప్

ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది బాలీవుడ్. ఒకప్పుడు గ్లామర్ షోతో బొమ్మఆడించిన బాలీవుడ్.. ఇప్పుడు కథలో కంటెంట్ ఉంటేనే కానీ ప్రేక్షకుడు మనవైపు చూడరని ఫిక్స్ అయ్యారు. దీంతో కంటెంట్ ఉన్న చిత్రాలవైపు మొగ్గు చూపిస్తున్నారు. విలక్షణ పాత్రలు.. ప్రయోగాత్మక కథలతో.. కొత్త కంటెంట్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా వరుస పరాజయాలతో బాలీవుడ్ బాట పట్టిన ప్రీత్ త్వరలో ఓ ప్రయోగాత్మక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్‌లో రకుల్‌ హిట్ కొట్టి చాలా ఏళ్లైంది.. నటిగా మెప్పించాలంటే కేవలం గ్లామర్ షోతో మాత్రమే సరిపోదని.. కాస్తో కూస్తో నటించడం రావాలని కాస్త లేటుగా తెల్సుకుంది ఈ భామ. అయినప్పటికీ కూడా ఈమెను వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. చెక్, ఏన్‌జీకే, స్పైడర్, విన్నర్ ఇలా తెలుగులో వరుస పరాజయాలు వెంటాడటంతో బాలీవుడ్‌ చెక్కేసింది ఈ భామ. అక్కడ బాగానే ఆఫర్లు వస్తుండటంతో బోల్డ్ పాత్ర చేయడానికి డేరింగ్ స్టెప్ వేసింది. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఇంటెన్స్ డ్రామాగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించబోతుందట. ఇప్పటికే నిర్మాతతో చర్చలు జరగగా.. రకుల్ ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో తన పాత్ర ద్వారా ప్రేక్షకులకు సోషల్ మెసేజ్ ఇవ్వబోతుందట రకుల్. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో ‘డాక్టర్ జీ’, సర్దార్ కా గ్రాండ్ సన్, థ్యాంక్ గాడ్ చిత్రాలను లైన్‌లో పెట్టింది రకుల్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aEKcxF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...