Friday, 2 April 2021

అనసూయకి ముసలి వయసు.. ‘పైన పటారం లోన లొటారం‌’ కాదుగా అంటూ హైపర్ ఆది రెచ్చిపోయాడు

యాంకర్ తన పక్కన ఉంటే హైపర్ ఆది చెలరేగిపోతుంటాడు. పంచ్‌లు ప్రవాహంలా దూసుకొస్తుంటాయి. డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రంగమ్మత్తను ఓ ఆట ఆడుకుంటాడు హైపర్ ఆది. ఇక అనసూయ కూడా తానేం తక్కువ కాదు అన్నట్టుగా హైపర్ ఆదికి కావాల్సినంత హైప్ ఇస్తుంటుంది. తాజాగా వచ్చేవారానికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమోలో‌లో హైపర్ ఆది, అనసూయలు చెలరేగారు. ‘నానమ్మ తాతయ్య ఖాళీగా ఉన్నారట.. ఓ మనవడ్ని ఇస్తే ఆడుకుంటామని అంటున్నారు’ అంటూ హైపర్ ఆదితో అనసూయ అనగా.. ఆమె భర్తగా యాక్ట్‌గా చేసిన హైపర్ ఆది.. ‘వాళ్లు ఖాళీగా ఉంటే వాళ్లనే ఓ కొడుకుని కనమను.. మనకి అంత సీన్ లేదని చెప్పండి’ అంటూ ముఖం పక్కకు పెట్టుకుని పంచ్ వేశాడు తెగ సిగ్గుపడిపోతూ. అవును అనసూయా.. రీసెంట్‌గా నువ్ ఓ పాట చేశావ్ కదా.. పైన పటారం లోన లొటారం అని కొంపతీసి అది నాకోసం చేశావా? అని ఆది అడగ్గా.. అయ్యో ఎంత మాట.. ఎంత మాట అంటూ లెంపలు వేసుకుంటూ తెగ నటించేసింది అనసూయ. ఇక అనసూయా.. నన్ను చూడు.. నన్ను చూడు.. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? అని అనసూయను ఆది అడగ్గా.. మీరు ఎప్పటికీ ముసలోడు కాకూడదు అని అనసూయ తెగ సిగ్గుపడిపోతూ.. మెలికలు తిరిగింది. నువ్ మాత్రం ముసలిదానివి అయిపోవచ్చు.. నను మాత్రం అవ్వకూడదా? అంటూ ఆది దిమ్మతిరిగే పంచ్ వేయడంతో నన్ను అంత మాట అంటావా అంటూ అతన్ని బాదేసింది అనసూయ. మొత్తానికి హైపర్ ఆది, అనసూయల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక అదిరే అభి, చలాకీ చంటి, రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్‌లు పంచ్‌లతో జబర్దస్త్ నవ్వులు అందించారు. కాగా జబర్దస్త్ జడ్జీ రోజా హెల్త్ ఇష్యూస్ వల్ల రెండు వారాలుగా జబర్దస్త్ కామెడీ షోకి దూరమైన విషయం తెలిసిందే. ఆమె ప్లేస్‌లో అలనాటి బ్యూటిఫుల్ హీరోయిన్ ఇంద్రజ ఎంట్రీ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uhBwF6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...