Friday, 23 April 2021

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న వరుణ్.. ‘గని’ సినిమాకు బ్రేక్

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మొదటి దశ కంటే ఎంతో దారుణంగా ఉంది. రోజుకు లక్షలాది మంది వైరస్ బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో సరైన చికిత్స అందక చాలా మంది కరోనా రోగులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. మరోవైపు కరోనా కట్టడికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూసివేశారు. అయితే కరోనా ప్రభావం నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు తమ షూటింగ్‌లను రద్దు చేసుకున్నాయి. ఆచార్య, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట.. తదితర సినిమాల షూటింగ్‌లు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి. ఇక షూటింగ్‌లు పూర్తైన సినిమాలు విడుదల అయ్యే పరిస్థితి కూడా లేదు. ఇక తమ వ్యక్తిగత సిబ్బందికి కరోనా రావడంతో కొందరు హీరోలు సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ‘రాధేశ్యామ్’ షూటింగ్‌లో తన మేకప్ మ్యాన్‌కి కరోనా రావడంతో ప్రభాస్, తన వ్యాన్ డ్రైవర్ కరోనాతో మృతి చెండంతో రామ్ చరణ్, ఇక తన స్టైలిస్ట్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మహేశ్ బాబు ముందు జాగ్రత్తగా తమంతట తాము ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తాజాగా మెగా ప్రిన్స్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నాడు. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తన ‘’ సినిమా షూటింగ్‌ని రద్దు చేసుకుంటున్నట్లు వరుణ్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాడు. కోవిడ్ కారణంగా ఏర్పడిన పరిస్థితులు మెరుగైన తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభిస్తామని అతను పేర్కొన్నాడు. ఇక వరుణ్ తేజ్ నటిస్తున్న మరో చిత్రం ‘ఎఫ్‌3’ సెట్‌లో వ్యక్తికి కరోనా రావడంతో ఆ సినిమా షూటింగ్ కూడా రద్దైంది. అయితే వరుణ్ సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్తున్నాడా.. లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. కిరణ్ కొరపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘గని’ చిత్రంలో సైయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ చివరినాటికి ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. జూలై 30న సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సినిమా ఈ మధ్యకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sOvvyq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...